Shruti Haasan: మొన్న సమంత.. నేడు శృతి.. ఏంటీ గాయాలు
Shruti Haasan Injured During The Shooting: ఒకప్పుడు హీరోయిన్లు అంటే రొమాన్స్ కు, సాంగ్స్ కు మాత్రమే పనికివచ్చేవారని చెప్పుకొస్తారు. ఇప్పుడు కూడా చాలా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే హీరోతో రొమాన్స్ కోసమే అనే అపోహ ఉంది. అయితే ఆ అపోహను చాలామంది హీరోయిన్లు బ్రేక్ చేస్తున్నారు. మేము కూడా హీరోలకు ధీటుగా యాక్షన్ చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు. ఇందుకోసం ముద్దుగుమ్మలు సైతం ఫీల్డ్ లోకి దిగి గాయాల పాలవుతున్నారు. ఈ మధ్యనే సమంత.. సిటాడెల్ షూటింగ్ లో చేతులకు గాయాలు చేసుకున్న విషయం తెల్సిందే.
ఇక తాజాగా మరో బ్యూటీ శృతి హాసన్ సైతం సెట్ లో గాయాలపాలయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో చెప్పుకొచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో శృతిహాసన్ పెట్టిన పిక్ లో రెండు కాళ్లకు తగిలిన దెబ్బలను చూపిస్తూ.. పనిలో మంచి రోజు అని క్యాప్షన్ ఇచ్చింది. తెల్లటి కాళ్లపై ఎర్రగా కందిపోయిన చర్మం కనిపించేసరికి ఆమె అభిమానులు చలించిపోయారు. అయితే ఇది ఏ సినిమాలో తగిలింది అనేది మాత్రం అమ్మడు చెప్పనే లేదు. దీంతో ఆ సినిమా ఏంటి అని అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం శృతి సలార్ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ది ఐ అనే సినిమాలో కూడా అమ్మడు నటిస్తోంది.