ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలకు హైదరాబాద్ వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన పలువురు ప్రముఖులు ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు
ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలకు హైదరాబాద్ వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన పలువురు ప్రముఖులు ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. ఎన్టీ రామారావు గురించి అద్భుతమైన మాటలు చెప్పుకొచ్చారు. ఇక ఈ వేడుకకు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రత్యేకమైన గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకకు తాను రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇంతమందిలో ఎన్టీఆర్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన నందమూరి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పారు.
“ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కోడంబాకమ్లో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది నిల్చొని ఉండే వారు.. అదేంటో అని తెలుసుకోవాలని వెళ్తే.. అదే ఎన్టీఆర్ ఇల్లు. ఆంధ్ర నుంచి ఎన్టీఆర్ను చూసేందుకు ఎంతో మంది వచ్చేవారు. లెజెండ్రీ ఆర్టిస్టులు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజ్ కుమార్, శివాజీ గణేష్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా సామాన్య వ్యక్తిలానే ఆలోచించేవారు. ఎన్టీఆర్ చేసిన సినిమాలు.. వేసిన పాత్రలు మరెవ్వరు వేయలేరు.. చేయలేరు. ఇక బాలకృష్ణతో నా అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన నాకు సోదరుడుతో సమానం. త్వరలో బాలయ్యతో కలిసి ఒక సినిమా చేయబోతున్నా” అంటూ ముగించారు శివరాజ్ కుమార్- బాలకృష్ణ మంచి స్నేహితులు. శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ మృతి చెందినప్పుడు బాలయ్య తట్టుకోలేకపోయాడు. ఆయన పునీత్ పార్దీవ దేహం వద్ద కంటనీరు పెట్టుకున్న వీడియోలు అప్పట్లో సంచలనం సృష్టించింది. బాలయ్యకు.. ఆ కుటుంబానికి అంత అనుబంధం ఉండేది. ఆ అనుబంధంతోనే బాలయ్య పిలిచిన వెంటనే శివన్న ఈ వేడుకకు హాజరయ్యాడు.