Sharwanand: పెళ్లి పీటలు ఎక్కనున్న కుర్ర హీరో
Sharwanand To Marry Rakshita Reddy: టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గత కొన్ని రోజులుగా శర్వా పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. అందరు అనుకున్నట్లే టీడీపీ నేత బొజ్జల గోపాల్ కృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని శర్వానంద్ వివాహమాడనున్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబ వర్గాలు మాట్లాడుకొని ఓకే చెప్పుకున్నట్లు తెలుస్తోంది. రక్షితతో శర్వా ఎంగేజ్ మెంట్ జనవరి 26 న జరగనుంది. అతి తక్కువమంది బంధుమిత్రుల మధ్య ఈ వేడుక జరగనుంది.
ఇక రక్షిత ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి వేడుక డేట్ ను నిర్ణయించనున్నారు. ఇక శర్వా కెరీర్ విషయానికొస్తే.. ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం శర్వా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మరి ఈ కుర్ర హీరో ఇప్పుడైనా తన కాబోయే భార్య గురించి అధికారికంగా అభిమానులతో పంచుకుంటాడో లేదో చూడాలి.