Pavitra- Naresh: పెళ్లితో ఒక్కటైన పవిత్రానరేష్
Senior Hero Naresh And Pavitra Lokesh Got Married: ఎప్పటినుంచో జరుగుతుంది అనుకున్నది నేడు జరిగిపోయింది. ఎట్టకేలకు ముదురు జంట పవిత్రా- నరేష్ పెళ్లితో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా నరేష్- పవిత్ర రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నో వివాదాల మధ్య ఈ జంట నేడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్దిమంది బంధుత్రుల మధ్య నరేష్, పవిత్ర మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ విషయాన్నీ నరేష్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
” కొత్త జీవితం మొదలు పెడుతున్నాం మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి.. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు .. మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ నరేష్ పవిత్ర” అంటూ ట్వీట్ చేశాడు. ఇక వీడియోలో సంప్రదాయబద్దకంగా వీరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నరేష్.. తన మూడో భార్యకు విడాకులు ఇంకా ఇవ్వలేదని తెలుస్తోంది. మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్లి ఎలా చేసుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ పెళ్లిపై నరేష్ మూడో భార్య రమ్య ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
https://twitter.com/ItsActorNaresh/status/1634067504384606210?t=pwFSfY2xS4LeUMZo-Glpew&s=08