Meena: ఆ హీరో నా క్రష్.. ఆయనకు పెళ్లి అయ్యిందని తెలిసి
Senior Actress Meena Talking About Her Hero Crush: సీనియర్ నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గతేడాది భర్తను పోగొట్టుకున్న ఆమె.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనా.. ఒక ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారి తన క్రష్ గురించి చెప్పుకొచ్చింది. తనకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఎంతో ఇష్టమని, అతని సినిమాలు మిస్ అవ్వకుండా చూసేదాన్ని అని చెప్పుకొచ్చింది.
” హీరోల్లో నాకు క్రష్ అంటే హృతిక్ రోషన్. అమ్మావాళ్ళకి కూడా హృతిక్ రోషన్ లాంటి అబ్బాయి అయితే పెళ్లి చేసుకుంటా మా అమ్మకి కూడా చెప్పాను. అయితే హృతిక్ రోషన్ కి పెళ్లి అయినప్పుడు నేను షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే నా గుండె పగిలిపోయింది. అంతగా హృతిక్ రోషన్ ని ఇష్టపడ్డాను. నిజం చెప్పాలంటే హృతిక్ కు పెళ్లి అయ్యేసరికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఛాన్స్ ఉంటే కొద్దిగా రిస్క్ అయినా అతడినే పెళ్లి చేసుకొనేదాన్ని” అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇకపోతే మీనా ఈ మధ్యనే ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఆమె కొన్ని తెలుగు సినిమాలను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు మీనా తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.