Jr NTR:టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Young Tiger ntr) చుట్టూ ఏం జరుగుతోంది?..సిటీలో ఉండి కూడా ఎన్టీఆర్ తాత శత జయంతి (NTR Centenary Celebrations) ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేకపోయారు?..
Jr NTR:టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Young Tiger ntr) చుట్టూ ఏం జరుగుతోంది?..సిటీలో ఉండి కూడా ఎన్టీఆర్ తాత శత జయంతి (NTR Centenary Celebrations) ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేకపోయారు?.. ఖమ్మం దాకా వెళ్లి మరీ NTR విగ్రహావిష్కరణ చేస్తానని మాటిచ్చిన జూనియర్.. కూకట్ పల్లి లో జరిగిన శతజయంతి సభకు హాజరు కాకపోవడం ఏంటి? రాజకీయ ప్రసంగాలు చేసే వేదికను వద్దు అనుకున్నాడా ? లేక గతంలో పిలవలేదని అలిగి రాకుండా ఉన్నాడా? ఎన్టీఆర్ గైర్హాజరైన పద్ధతిని ఎలా చూడాలి?.. ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఆరోజే అని తెలిసి కూడా అదే రోజు శత జయంతి వేడుకలని ఏర్పాటు చేయడం వెనకున్న మతలబేంటీ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్‌పై అందిస్తున్న ప్రత్యేక కథ ఇది.
బర్త్‌డే వేడుకలు అని తెలిసి కూడా…
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోని కైతలాపూర్ గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు విజయవాడలోని పోరంకి గార్డెన్స్‌లో ఓ వేడుక జరిగింది. దానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు టీడీపీ జాతీయ అథ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నరా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్,నందమూరికల్యాణ్ రామ్ లకు ఆహ్వానాలు అందజేదు. కారణం ఏంటని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది.
అయితే తాజాగా శనివారం మే 20 సాయంత్రం కేపీహెచ్‌బీ కాలనీలోని కైతలాపూర్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రావాలని కమిటీ చైర్మన్ జనార్థన్ ఎన్టీఆర్‌ను స్వయంగా ఆహ్వానించారు. ఆయనకు ఆ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు అని తెలుసు. కానీ అదే రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరీ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడంతో తన పుట్టిన రోజు కార్యక్రమాలని ముందుగా ప్లాన్ చేసుకున్నానని, తాను శత జయంతి వేడుకల్లో హాజరు కాలేనని ఎన్టీఆర్ అప్పుడే స్పష్టం చేశారట. అయినా సరే సిటీలో హోర్డింగ్‌లు వేయించడం,ఎన్టీఆర్ వస్తున్నారని అందరిలో భ్రమను కలిగించడం ఎందుకన్నది ఇప్పుడు అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడి మదిని తొలిచేస్తోంది.
బాలయ్య నిర్లక్ష్యం చేయడమే…
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కోసం కొన్ని నెలలుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఈ వేడుకలు సంత్సరం పాటు జరపాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టారు. అతిథులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ విషయంలో బాలయ్య చొరవ తీసుకున్నారు. ప్రతీ ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్‌ని మాత్రం మరిచారట. దీంతో ఎన్టీఆర్ అలకబూనారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఎన్టీఆర్ శత జయంతి వేకలకు గైర్హాజర్ అయ్యేలా చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ఈ వేడుకలకు హాజరు కాడని తెలిసి కూడా ఆహ్వానించామని, కావాలనే తను పాల్గొనలేదని, క్రియేట్ చేయడానికే ఆహ్వాన పత్రిక అందించిన ఫొటోలు, ఎన్టీఆర్ కార్యక్రమానికి వస్తున్నారని సిటీ అంతా హోర్డింగ్‌లు పెట్టించారని, ఫైనల్ గా ఈ విషయంలో ఎన్టీఆర్‌ను కార్నర్ చేయాలన్న ప్లాన్‌లో భాగంగానే జరుగుతోందని ఆయన అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని అవసరానికి వాడుకుంటూ తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా అంటున్నారు.
ఎన్నికల ప్రచారం కోసం ప్రచార సారథిగా..
2009 ఎన్నికల్లో టీడీపీ ప్రచారం కోసం ప్యూహాత్మకంగా నారా చంద్రబాబు నాయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దించడం తెలిసిందే. అన్నగారిలాగా ఖాకీ డ్రెస్ ధరించి చైతన్య రథంపై ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లారు. ఖమ్మంలో ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకునే క్రమంలో ఎన్టీఆర్ కు నల్లగొండ సమీపంలోని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు బలమైన గాయాలయ్యాయి. తలకు, భుజానికి, ఎల్బోకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనని కిమ్స్‌కు తరలించి ప్రత్యేక చికిత్స అందజేశారు. అభిమానుల ఆశీర్వాదం, ప్రార్థనలే తారక్‌ని కాపాడాయని ప్రమాదం తరువాత బాలకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఎన్టీఆర్‌కు అసలు రహస్యం అప్పుడే తెలిసిందా?
ప్రచారానికి ముందు ఎన్టీఆర్ తనకు అత్యంత ఆప్తుడైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేశారట. కానీ ఆ విషయాన్ని చంద్రబాబు లైట్ తీసుకోవడంతో ఎన్టీఆర్ మనస్తాపానికి గురయ్యారని అంటారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ని పెద్దగా పట్టించుకోలేదు.దీంతో `వాడుకుని వదిలేశారని` ఫ్యాన్స్, రాజకీయ విశ్లేషకులు మండిపడ్డారు. అదే ఇప్పటికీ ఎన్టీఆర్ మదిని తొలుస్తోందట. ఆ కారణంగానే నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడులకు దూరంగా ఉంటున్నారని ఇన్ సైడ్ టాక్.
ఎన్టీఆర్ పుట్టిన రోజున నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయకపోవడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఎన్టీఆర్ బలం పార్టీలో పెరిగితే తమకు ఇబ్బందికరంగా మారుతుందని, అంతే కాకుండా లోకేష్ ప్రాధాన్యం తగ్గుతుందని, బాలయ్య, నారా చంద్రబాబు నాయుడు కావాలనే ఎన్టీఆర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆ విషయం ఎన్టీఆర్‌కు 2009 ఎలక్షన్స్ తరువాతే అర్థమైందని..అందుకే వీరికి దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.