ఆహా ఓటిటీ.. ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇక సినిమాలతో పాటు ఆహా ఒరిజినల్స్ పేరుతో మంచి మంచి వెబ్ సిరీస్ లను కూడా రిలీజ్ చేస్తుంటారు.
ఆహా ఓటిటీ.. ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇక సినిమాలతో పాటు ఆహా ఒరిజినల్స్ పేరుతో మంచి మంచి వెబ్ సిరీస్ లను కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్యనే న్యూసెన్స్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు సత్తిగాని రెండు ఎకరాలు రిలీజ్ కు రెడీ అవుతుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా నటించిన జగదీష్ ప్రతాప్ ఈ సిరీస్ లో హీరోగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు అభినవ్ దండా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. సత్తిగాడికి రెండు ఎకరాలు పొలం ఉంటుంది. దాన్ని అమ్మడానికి పడే కష్టాలను హాస్యాస్పదంగా చూపించారు. కేవలం హాస్యమే కాకుండా సెంటిమెంట్, క్రైమ్ ను కూడా చూపించారు. బిడ్డకు హార్ట్ ఆపరేషన్ కోసం ఒక తండ్రి పడే బాధను చూపించారు. ఆ బిడ్డ కోసం పొలాన్ని అమ్మడానికి రెడీ అవవడం.. ఆ పొలాన్ని ఎవరు కొనకపోవడం.. చివరికి దొంగతనం చేయడం.. ఆ దొంగ కేసు బదులు హత్య కేసు మీద పడడం లాంటివి చూపించారు. చివరికి సత్తిగాని రెండు ఎకరాలు కొన్నది ఎవరు..? హత్య చేసింది ఎవరు..? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే మే 26 వరకు ఆగాల్సిందే.