దుమ్మురేపుతోన్న ‘మ..మ.. మహేశా’ లిరికల్ సాంగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో రూపొందిన సర్కారు వారి పాట ఈనెల 12న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు యమా జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మ.. మ.. మహేశా’ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
మహేష్ బాబు, కీర్తి సురేష్ పోటీ పడి మరీ ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇక మహేష్ స్టెప్స్ చూసిన అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. సింగర్స్ శ్రీకృష్ణ, జోనితా గాంధీ ఆలపించారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటల మాదిరిగానే.. ఈ పాట కూడా చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరడం గ్యారంటీ అంటున్నారు అభిమానులు. మరి చూడాలి ఈ సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో.