గత కొన్నిరోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు జరగడం అభిమానులను కలవరపెడుతున్నాయి.
గత కొన్నిరోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు జరగడం అభిమానులను కలవరపెడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, శరత్ బాబు, ఆదిత్య సింగ్ రాజ్ పుత్, వైభవి ఉపాధ్యాయ, నితేష్ పాండే, టీనా టార్నర్.. ఇలా వరుసగా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు మృత్యువాత పడుతుండడం ఆందోళనకు గురిచేస్తుంది. ఇక తాజాగా హాలీవుడ్ నటి సమంతా వైన్స్టెయిన్ క్యాన్సర్ తో కన్నుమూసింది.
హాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. అతి చిన్న వయస్సులోనే హాలీవుడ్ నటి సమంతా వైన్స్టెయిన్ కన్నుమూసింది. గత కొంత కాలంగా ఆమె అండాశయ క్యాన్సర్ తో పోరాటం చేస్తుంది. చికిత్స పొందుతూనే ఆమె.. మే 14 న మృతి చెందగా.. ఈ వార్త ఆలస్యంగా వెలుగుచూసింది. సమంత వయస్సు 28. తొమ్మిదేళ్ల వయస్సు నుండి నటించడం ప్రారంభించిన ఆమె.. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్ తో పోరాడుతుంది. 2005లో బిగ్ గర్ల్లో జోసెఫిన్ పాత్రలో నటించి మెప్పించిన ఆమె ఈ సినిమాకు గాను 2006లో ఏసీటిఆర్ఏ(ACTRA) అవార్డును గెలుచుకుంది, ఆ ప్రశంసలను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. క్యారీ,డిఎన్ ఏస్, డినో రాంచ్ మరియు విష్ఫార్ట్ వంటి యానిమేషన్ సిరీస్లలోకూడా నటించింది. ఇక రెండేళ్ల క్రితం మైఖేల్ నుట్సన్ను ను పెళ్లాడిన ఆమె చివరగా తన భర్తతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంత చిన్న వయస్సులోనే ఆమె మృతి చెందడం అత్యంత విషాదకరమని అభిమానులు, సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.