Samantha: నాగ చైతన్యతో కలిసి ఉన్న ఇంటినే మళ్లీ కొన్న సామ్..?
Samantha Buys House Where She Used To Live With Naga Chaitanya: టాలీవుడ్ హీరోయిన్ సమంత, అక్కినేని వారసుడు నాగ చైతన్య విడాకులు తీసుకొని ఏడాది కావొస్తున్నా వారి గురించిన ప్రతి వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. నాలుగేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి తరువాత సీనియర్ నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి అపార్ట్మెంట్స్ లో ఒక ప్లాట్ ను కొనుగోలు చేశారు. పెళ్లి తరువాత ఆ ఇంటిని తమకు నచ్చినట్లు తయారుచేసుకున్న ఈ జంట విడాకుల తరువాత ఆ ఇంటిని వదిలేసి బయటికి వచ్చేశారు. ఆ తరువాత ఆ ఇంటిని వేరొకరికి అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అదే ఇంటిని సామ్ రెండింతలు డబ్బు ఇచ్చి కొనుగోలు చేసినట్లు మురళీ మోహన్ తెలిపారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ “ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత మరో ఇల్లు కొనడానికి ఎక్కడెక్కడో బాగా తిరిగింది. కానీ ఆవిడకు ఎక్కడా నచ్చలేదు. గతంలో ఉన్న ప్లాట్ అయితేనే సెక్యూరిటీ పరంగా సేఫ్టీ పరంగా బాగుంటుందని నన్ను వచ్చి అడిగింది. అయితే అప్పటికే వేరే వాళ్లకు అమ్మేశానని చెప్పడంతో ఆమె నిరాశకు గురైంది. ఆ తరువాత వాళ్లతో మాట్లాడి ఒప్పించి.. ఫ్లాట్ కొన్నవాళ్లకు కొంత ప్రాఫిట్ కూడా కలిపిచ్చి సమంత ఆ ప్లాట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత ఆ ఇంట్లోనే ఉంటోంది. ఆమె వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటారు” అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. సమంత.. చైతూ జ్ఞాపకాలను మర్చిపోలేకనే మళ్లీ ఆ ఇల్లు తీసుకుందని కామెంట్స్ పెడుతున్నారు.