టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత .. ఈ మధ్యనే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం సామ్.. తెలుగు సినిమాల కంటే.. బాలీవుడ్ సినిమాల మీదనే ఫోకస్ ఎక్కువగా పెట్టింది అంటే అతిశయోక్తి కాదు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత .. ఈ మధ్యనే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం సామ్.. తెలుగు సినిమాల కంటే.. బాలీవుడ్ సినిమాల మీదనే ఫోకస్ ఎక్కువగా పెట్టింది అంటే అతిశయోక్తి కాదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న సామ్ .. ప్రస్తుతం సిటాడెల్ ఇండియా వెర్షన్ లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రియాంక చెప్రా నటించిన సిటాడెల్ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇక ఒరిజినల్ సిటాడెల్ లో ఇంటిమేటెడ్ సీన్స్ ను బాగానే చూపించారు.
ప్రియాంక అర్ధనగ్న పోజులు, లిప్ లాక్ లు చూపించారు. ఇక సిటాడెట్ ఇండియన్ వెర్షన్ లో కూడా ఈ ఇంటిమేటెడ్ సీన్స్ ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. వరుణ్ తో సామ్ లిప్ లాక్ లు, రొమాంటిక్ సన్నివేశాలు హై లో ఉండనున్నాయట. ఇప్పటి వరకు రొమాంటిక్ సీన్స్ సమంత చేసింది.. కానీ మరీ శృంగార సన్నివేశాల్లో నటించడం తక్కువ అనే చెప్పాలి. మరి ఈ వెబ్ సిరీస్ లో సమంత పాత్రను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే సామ్ పై ఎంతో నెగెటివిటి ఉంది. ఈ సిరీస్ లో కనుక హద్దుమీరిన శృంగారంలో కనిపిస్తే కనుక ట్రోలర్స్ మరోసారి ఆమెపైకి విరుచుకుపడతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే సిరీస్ వచ్చేవరకు ఆగాల్సిందే.