Samantha: శాకుంతలం రివ్యూ చెప్పిన సమంత
Samantha And Team Watched Shaakuntalam Final Output: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. గతేడాది రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల తరువాత ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమంత ఎంతో గ్యాప్ తీసుకొని పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు మొదలయ్యాయి.
ఇక తాజాగా ఈ సినిమా ఫైనల్ ఔట్ పుట్ ని సమంత, దిల్ రాజు, డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత నీలిమ గుణ వీక్షించారు. సినిమా చూసాకా సామ్, దిల్ రాజు ఆనందానికి అవధులు లేవు. ఆ వీడియోను సామ్ తన సోషల్ మీడియాద్వారా పంచుకుంది. “గుణశేఖర్ గారు శాకుంతలం సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. ఇంత అద్భుతమైన సినిమాని మీరు నాకు అందించడం సంతోషంగా ఉంది. నా లైఫ్ లో మరిచిపోలేని చిత్రంగా ఇది ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలోని ఎమోషన్స్ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతాయని భావిస్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నేను వేచి ఉండలేకపోతున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక సామ్ ఇచ్చిన రివ్యూతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ చిత్రంతో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.