Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన కండల వీరుడు
Salman Khan participating Green India Challenge: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు.తెలంగాణ రాష్ట్ర సమితి యంగ్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పర్యావరణ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.
ఇటీవలే తన సినిమా ‘కభీ ఈద్ కభీ దివాళీ’ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే రెండు రోజుల నుంచి సినీ కార్మికుల మెరుపు సమ్మె కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. “మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కో మొక్క ఒక్కో మనిషి జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుంది.
అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరం. అలాంటి అనర్ధాలు ఆపాలంటే మొక్కలను నాటడం ఒక్కటే పరిష్కారం. నా అభిమానులంతా విధిగా ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని కోరుతున్నాను..” అని అన్నారు.