Salman Khan:బాలీవుడ్ కండల వీరుడిగా పాపులర్ అయిన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీసెంట్గా `కిసీక భాయ్ కిసికి జాన్`(kisika bhai kisiki jaan)మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
Salman Khan:బాలీవుడ్ కండల వీరుడిగా పాపులర్ అయిన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీసెంట్గా `కిసీక భాయ్ కిసికి జాన్`(kisika bhai kisiki jaan)మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ `వీరం`(Veeram) ఆధారంగా హిందీలో రీమేక్ అయిన ఈ మూవీ రీసెంట్గా విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కూడా సల్మాన్ మార్కు వసూళ్లని సాధించలేకపోయింది. ఈ మూవీ ఫలితం విషయంలో నిరాశకు గురైన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం యష్ రాజ్ ఫిలింస్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.
`టైగర్ 3` పేరుతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక గెస్ట్ క్యారెక్టర్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కనిపించబోతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీని నవంబర్ 10న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ తాజాగా కొత్త లుక్ లోకి మారిపోయారు.
స్టైలిష్ లుక్‌లో గోటీతో ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ముంబై ఏరియర్ పోర్ట్‌లో సల్మాన్ చేసిన పని అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సల్మాన్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్లూ జీన్స్, బ్లాక్ జాకెట్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్న సల్మాన్ ముంబై ఏయిర్ పోర్ట్‌లో సందడి చేశారు. వ్యక్తిగత సిబ్బందితో వెళుతుండగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ పిల్లవాడు సల్మాన్‌ని హగ్ చేసుకోవడం అక్కడున్న వారిన షాక్ కు గురి చేసింది.
Salman Khan Hugs Little Fan
అయితే ముందుగానే ఆ పిల్లవాడిని గమనించిన సల్మాన్ తన కోసమే ఆగిపోయారు. సెక్యురీటీని దాటుకుని తనని చేరుకున్న పిల్లవాడిని సల్మాన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. సెక్యురిటీ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన అభిమానులు, నెటిజన్లు సల్మాన్ పై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. `ఈ బాబు చాలా అదృష్టవంతుడు` అని, సల్మాన్ ఖాన్ ని అంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, స్టార్ అంటే సల్మాన్ ఖాన్ల ఉండాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.