Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన మైథలాజికల్ డ్రామా `ఆది పురుష్`(adipurush) రిలీజ్ కు రెడీ అవుతోంది.
Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన మైథలాజికల్ డ్రామా `ఆది పురుష్`(adipurush) రిలీజ్ కు రెడీ అవుతోంది. టి సిరీస్‌తో కలిసి రెట్రోఫిల్స్ వారు నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 16న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ `సలార్`. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి వర్క్ చేస్తున్న తొలి ప్రాజెక్ట్ కావడం, ఈ మూవీ కూడా అదే తరహా కథ, కథనాలతో పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీగా రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా చెదురు చూస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కనిపించనున్నారు.
భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందంటూ ప్రస్తుతం నెట్టింట ప్రచారం జరగుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్యాగ్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియా వేదిగా `సలార్` మూవీ రిలీజ్ డేట్ మార్పుపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. `ఎలాంటి ఆధారం లేని వార్తలను నమ్మకండి. `సలార్` అనుకున్న సమయానికే విడుదలవుతుంది.
సెప్టెంబర్ 28న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి` అంటూ ట్విట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ క్లారిటీ ఇచ్చిన ట్వీట్లని రీట్విట్ చేస్తూ నెట్టింట హంగామా చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌పై స్పష్టతనిచ్చిన మేకర్స్ `సలార్` రెండు భాగాలు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
గతంలో కన్నడ నటుడు దేవరాజ్ `సలార్` టూ పార్ట్స్ అంటూ అసలు సీక్రెట్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానల్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన దేవరాజ్ `సలార్` రెండు భాగాలుగా రానుందని, తొలి పార్ట్‌లో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని, సెకండ్ పార్ట్ లో మాత్రం తన క్యారెక్టర్‌కు మంచి స్కోప్ ఉంటుందని వెల్లడించారు. దీంతో సలార్ రెండు భాగాలుగా రానుందని జరుగుతున్న ప్రచారంపై నిజమని తేలిపోయింది.