Sakunthalam Trailer: కర్మకు ఎవరు అతీతులు కాదు.. ఆసక్తిరేపుతున్న శాకుంతలం ట్రైలర్
Sakunthalam Trailer Out: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ కుర్ర హీరో దేవ్ మోహన్ జంటగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దుష్యంతుడు శకుంతల దేవిల అద్భుత ప్రేమ కావ్యాన్ని దృశ్య రూపంగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ శాకుంతలం ట్రైలర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ట్రైలర్ మరింత అద్భుతంగా ఆకట్టుకొంటుంది. గుణ శేఖర్ చెప్పినట్లుగానే ఈ సినిమాతో మరో అద్భుత సృష్టిని సృంచబోతున్నాడు. శకుంతలా దేవిగా సమంత.. దుష్యంతుడు గా దేవ్ మోహన్ నటన, ఆహార్యం, రొమాన్స్, ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ళ.. ఇలా ప్రతి పాత్రకు స్టార్ క్యాస్టింగ్ తీసుకొని సినిమాపై అంచనాలను పెంచేశాడు గుణ శేఖర్. శకుంతలా దేవిగా సమంత హావభావాలు.. ఆమె కెరీర్లో ఇదో మైలురాయిగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక గుణ శేఖర్ సినిమాలు అంటేనే విజువల్స్. గుణశేఖర్ మార్క్ సెట్స్.. సినిమాను గ్రాండియర్ గా తీయాలనే తనకున్న ఆర్ట్ ను ఇందులో చూపించేశాడు. ఇక చివర్లో అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఎంట్రీ అయితే వావ్ అనిపించింది. మొత్తానికి ట్రైలర్ ఒక విజువల్ వండర్. ట్రైలర్ తోనే ఆసక్తిని పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.