Sai Kumar: ‘మూడో కన్ను’ తెరుస్తానంటున్న సాయి కుమార్
Sai Kumar New movie Mudo Kannu Shooting Compleated: సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి, నిరోషా, కాశీ విశ్వనాథ్,మాధవీ లత, ప్రదీప్ రుద్ర, దేవి ప్రసాద్, సూర్య ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం మూడో కన్ను. సెవెన్ స్టార్ క్రియేషన్స్ మరియు ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా సునీత రాజేందర్, ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు విభిన్నమైన కథలను కలిపి ఒక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ తెరక్కిందని సమాచారం.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్.. ఈ ప్రెస్ మీట్ లో సాయికుమార్ మాట్లాడుతూ “కొత్త కథతో వస్తున్న కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నానని, ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని” చెప్పారు. అలాగే మరో నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కథ అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుందని, అందరికి నచ్చుతుందని అన్నారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని తెలిపారు. మరి ఈ సినిమాతో సాయి కుమార్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.