Ajay Bhupathi: ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ ‘మంగళవారం’ ఏదో చూపిస్తాడట
Rx100 Director Ajay Bhupathi Next Film Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా తరువాత మనోడు ఇండస్ట్రీని షేక్ ఆడించేస్తాడు అనుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ల వరకు కంటికి కూడా కనిపించలేదు. ఇక ఆ తర్వాత శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ గా మహాసముద్రం ను తెరకెక్కించాడు. ఈ సినిమా బీభత్సమైన హిట్ అందుకుంటుందని అనుకున్నారు.. కానీ, బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడింది. దీంతో అజయ్ గురించి జనాలు మాట్లాడుకోవడం కూడా మానేశారు.
ఇక ఆ సినిమా కు కొంత గ్యాప్ ఇచ్చిన అజయ్ తాజాగా తన మూడో సినిమాను ప్రకటించాడు. దాని పేరే మంగళవారం. నేడు ఈ సినిమా పోస్టర్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. పోస్టర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక సీతాకోక చిలుక ఆకారంలో మధ్యలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. చుట్టూ చీకటిలో ఆమె ఎగురుతున్నట్లు కనిపించింది. హర్రర్ నేపథ్యంలో ఈ సినిమా తెరక్కుతుందని టాక్. మరి ఈ సినిమాతోనైనా అజయ్.. తన మొదటి సినిమా లా హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.