RRR: ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు.. చరిత్ర తిరగరాయడమే
RRR Nominated For Best Original Song: ఇండియా ప్రజల ఆశలు ఫలించాయి. ఎట్టకేలకు ఆస్కార్ నామినేషన్స్ లో తెలుగోడి సత్తా చూపించే సమయం ఆసన్నమైంది. దేవుడా.. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అని కోరుకున్న ప్రతి తెలుగోడి కోరికను దేవుడు మన్నించాడు. ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు సాంగ్ ఎంపికైంది. తాజాగా నేడు 95 వ ఆస్కార్ అవార్డ్స్ షార్ట్ లిస్ట్ ను అనౌన్స్ చేశారు. ఇందులో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యింది. ఈ మధ్యనే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ సాంగ్.. ఇప్పుడు ఆస్కార్ కు నామినేట్ కావడం విశేషం.
హాలీవుడ్ సినిమాలు బ్లాక్ పాంథర్, టాప్ గన్ లతో పాటు మరో మూడు సినిమాలతో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ పోటీ పడనుంది. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడంతో అభిమానులు నెట్టింట హల్చల్ చేస్తున్నారు. మిగతా కేటగిరిలో కూడా ఆర్ఆర్ఆర్ కు ఆస్కారం ఉంటుందా.. ? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12 న జరగనుంది. మరి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హీరో కేటగిరిలో ఎవరు ఉంటారో చూడాలి.