చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత రాత్రి ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్ సన్ మృతి చెందిన విషయం తెల్సిందే.
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత రాత్రి ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్ సన్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో చరణ్ ను, తారక్ ను ఎంతగా గుర్తుపెట్టుకుంటామో.. వారికి ధీటుగా నిలిచిన స్కాట్ దొరను కూడా అంతే గుర్తుపెట్టుకుంటాం. అలాంటి క్రూరమైన గవర్నర్ పాత్రలో నటించి మెప్పించాడు రే స్టీవెన్ సన్. ఈ సినిమాతో ఆయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ లో రే స్టీవెన్ సన్ .. ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాడు. 56 ఏళ్ల రే స్టీవెన్ సన్ హఠాన్మరణంపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తీవ్ర విషాధం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ ట్వీట్ చేస్తూ.. తమ మనసులోని భావాన్ని వెల్లడించింది. ఇక రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ సైతం ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
“రే స్టీవెన్ సన్ మరణ వార్త విని షాక్ అయ్యాను. చాలా త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయనతో పని చేయడం గొప్ప అనుభవం. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో తమ ఆలోచనలు ప్రార్థనలు.. ఆయన కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని కల్గించాలని భావిస్తున్నట్లు” ఎన్టీఆర్ తెలిపాడు. ఇక రాజమౌళి.. సెట్ లో తనతో పాటు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ” షాకింగ్… ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. రే తనతో సెట్స్ లో తన యాక్టివ్ నెస్ తో ఒక చైతన్యం తీసుకువచ్చాడు. ఇది ఒక అంటువ్యాధి. అతనితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రార్థనలు అతని కుటుంబ సభ్యులతో ఉన్నాయి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక” అని ట్వీట్ చేశాడు. ఇక రామ్ చరణ్ సైతం… రే స్టీవెన్ సన్ మరణ వార్త విని షాక్ అయ్యాను.. రెస్ట్ ఇన్ పీస్ డియర్ స్కాట్.. మీరు ఎప్పటికి గుర్తుండిపోతారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Shocking and deeply saddened with news of Ray Stevenson passing away. Rest In Peace Dear Scott, you'll be remembered forever. 🙏🏼
— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2023
Shocked to hear about Ray Stevenson's passing. Gone too soon. It was a great experience working with him. May his soul rest in peace.
My thoughts and prayers are with his family and dear ones during this difficult time.
— Jr NTR (@tarak9999) May 23, 2023