Rashmika Mandanna:రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay deverakonda), క్రేజీ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియార్ కామ్రేడ్` సినిమాల్లో నటించారు.
Rashmika Mandanna:రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (vijay deverakonda), క్రేజీ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియార్ కామ్రేడ్` సినిమాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లోనూ వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అంతే కాకుండా ఈ రెండు సినిమాల ప్రమోషన్స్‌లోనూ ఇద్దరు కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు జోరుగా వినిపించడం మొదలైంది. ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ విజయ్ దేవరకొండ, రష్మిక ప్రత్యేకంగా వెకేషన్లకు వెళుతూ ఆ ఫొటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
దీంతో వీరు ప్రేమలో ఉన్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై మీడియా ప్రశ్నించిన ప్రతీసారి రష్మిక, విజయ్ దేవరకొండ మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ వస్తున్నారు. అయినా సరే వీరిపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా రష్మికను `వదిన` అంటూ ఫిక్సయిపోయారు.
తాజాగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన `బేబీ` మూవీ థర్డ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక అతిథిగా పాల్గొంది. ఆమెని స్టేజ్‌పై చూసి విజయ్ దేవరకొండ అభిమానులు వదిన వదిన అంటూ కామెంట్ చేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది. అభిమానులు `వదిన` అని అరుస్తుంటే..ఆ మాటలు వింటూ రష్మిక మందన్న మురిసిపోయింది. చివరికి ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ ని వారించాల్సి వచ్చింది. ఆ సమయంలో స్టేజ్ పై సిగ్గుల మొగ్గవుతూ ఫ్యాన్స్ వదిన పిలుపుని రష్మిక ఎంజాయ్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బేబీ`. ఈ మూవీ ద్వారా వైష్ణవి చైతన్య హీరోయిన్గా పరిచయం అవుతుండగా, విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్ కె ఎన్ నిర్మిస్తున్నారు. ఓ అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.