Rana Daggubati: ఇప్పటికీ నేను సమంతతో మాట్లాడతా
Rana Talking About Samantha: రానా దగ్గుబాటి- వెంకటేష్ దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మించింది. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్ కు రీమేక్ గా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సిరీస్ మార్చి 10 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో రానా పాల్గొని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఇంటర్వ్యూలో రానాకు, సమంతకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. తమ వ్యక్తిగత సమస్య గురించి బహిరంగంగా చెప్పినప్పుడు నటీనటులు ప్రజల గొంతుకగా మారగలరా అన్న ప్రశ్నకు రానా మాట్లాడుతూ.. ” ఎవరి స్వంత అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఒకరికి ఏదైనా చెప్పినప్పుడు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఆలోచిస్తారు. సమంత ఆరోగ్య పరిస్థితి తెలిసి నేను కాల్ చేశాను.. మేమిద్దరం తరుచు కాల్స్ లో మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎవరి జీవితం సాఫీగా ఉండదు. ఎవరి జీవితాన్నైనా ఏదో ఒకటి మారుస్తోంది. అది హెల్త్ ఇష్యూ కావొచ్చు.. మరి ఇంకేదైనా కావొచ్చు. అలాంటి సమయంలో మనం ఏంటి..? ఎలా ఉన్నాం..? ఎవరికి చెప్పాలి.. వాళ్లు ఎలా స్పదింస్తారు.. వీటి గురించి ఆలోచించి విచారంగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో తిరిగి లేచి ముందుకు సాగడమే ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.