Rana Daggubati: అలాంటి వారికి క్షమాపణలు చెప్పిన రానా
Rana Naidu Star Rana Daggubati Advises Viewer Discretion: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్ని విధాలా ఆసక్తి కలిగించిన రానా నాయుడు ప్రమోషనల్ మీట్ లో వెంకటేశ్, ఈ సిరీస్ ను ఇంటిల్లిపాదితో కలసి చూడకండి. ప్రైవేట్ గా ఎవరికి వారు చూడవలసిందే అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ముఖ్యంగా కుర్రకారు సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసారు. ఎట్టకేలకు మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిరీస్ పరంగా అంతా ఓకే కానీ కొద్దిగా అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందని, అందులోనూ వెంకటేష్ బూతులు మాట్లాడడం అనేది చాలామందికి నచ్చలేదని చెప్పుకొస్తున్నారు.
మొదటి నుంచి వెంకటేష్ ను ఫ్యామిలీ హీరోగా చూసిన లేడీ ఫ్యాన్స్ అయితే వెంకీని ఇలాంటి పాత్రలో చూస్తామని అనుకోలేదని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సిరీస్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకు రానా ధన్యవాదాలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ నంబర్. 1 గా ఉన్న పోస్టర్ ను షేర్ చేస్తూ.. ” మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ఈ సిరీస్ పై ద్వేషం పెంచుకొని విమర్శిస్తున్నవారికి నా క్షమాపణలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ముందు ముందు ఈ సిరీస్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.