Dulquer Salmaan: మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో విలక్షణమైన కథల్ని ఎంచుకుంటూ హీరోగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). తెలుగులో `మహానటి`(Mahanati), సీతారమం`(Sitaramam) వంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
Dulquer Salmaan: మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో విలక్షణమైన కథల్ని ఎంచుకుంటూ హీరోగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). తెలుగులో `మహానటి`(Mahanati), సీతారమం`(Sitaramam) వంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ప్రముఖ మలయాళ దర్శకుడు జోషీ తనయుడు, దుల్కర్ స్నేహితుడు అభిలాష్ జోషీ దర్శకత్వంలో `కింగ్ ఆఫ్ కోత` మూవీ చేస్తున్నారు.
గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా హీరో దుల్కర్ జీ స్టూడియోస్‌తో కలిసి వే ఫేరెర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తూ నటిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా, రీతూ సింగ్ కీలక అతిథి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని ఆగష్టు 23న మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ఓ భారీ బైలింగ్వల్ మూవీకి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో దుల్కర్ తో కలిసి రానా నటించడం లేదు. ఆయన కేవలం నిర్మాతగానే వ్యవహరించబోతున్నారు. దుల్కర్ కు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రానా ఆయనతో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఓ భారీ బైలింగ్వల్ మూవీకి శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇంత వరకు సురేష్ ప్రొడక్షన్స్ దగ్గుబాటి ఫ్యామిలీకి బిగ్ బ్యానర్‌గా ఉంది. అయితే రానా మాత్రం రామ్ చరణ్ తరహాలో కొత్త నిర్మాణ సంస్థని దుల్కర్ సినిమాతో ప్రారంభిస్తున్నారు. అదే `స్పిరిట్ మీడియా`. దీనిపై నిర్మాతగా తొలి ప్రయత్నంగా దుల్కర్ సల్మాన్‌తో భారీ బైలింగ్వల్ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న `కింగ్ ఆఫ్ కోత` రిలీజ్ కు ముందే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.
జూలై 28న హీరో దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రానా ఈ భారీ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని లేదంటే డి. రామానాయుడు జయంతి అయిన జూన్ 6న కానీ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. సముద్రఖనితో పాటు భారీ తారగణం నటించనున్న ఈ మూవీని ఈ సంవత్సరం చివరలో ప్రారంభించాలని రానా ప్లాన్ చేస్తున్నారట.
#DulquerSalmaan to do a Tamil & Telugu Bilingual movie produced by #RanaDaggubati's Spirit Media 🤝🎬
– Samuthirakani & Many Pan Indian artists plays an important role💥
– Shooting begins end of this Year & Official announcement expected on July 28(DQ Birthday)🎥🎉
– Director… pic.twitter.com/U509bdxqbw— AmuthaBharathi (@CinemaWithAB) June 1, 2023