Ramya Krishnan Play A Key Role In SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB28.
Ramya Krishnan Play A Key Role In SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB28. సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ పాత కోసం సీనియర్ నటీమణులను త్రివిక్రమ్ రంగంలోకి దింపుతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. గతంలో హీరో మహేష్ బాబు నటించిన నాని సినిమా కోసం మహేష్, రమ్యకృష్ణ ఒక రొమాంటిక్ సాంగ్ లో నటించారు. అయితే ఆ సాంగ్ ను సినిమాలో పెట్టలేదు. అయినా యూట్యూబ్ లో ఈ సాంగ్ ఇప్పటికి కనిపిస్తూ ఉంటుంది.
ఇక ఇన్నాళ్ల తరువాత మహేష్ బాబుతో కలిసి రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో రమ్యకృష్ణ ఈ సినిమాలో ఎటువంటి పాత్ర చేయబోతోంది అంటూ ఆరా తీయడం మొదలు పెట్టేశారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం రమ్యకృష్ణ ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క డాన్స్ ఐకాన్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. మరి మహేష్ సరసన నటించడానికి రమ్యకృష్ణ ఒప్పుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి.