Pushpa2:అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప` (Pushpa). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers) వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు.
Pushpa2:అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప` (Pushpa). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers) వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించి హీరో అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేర్చింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి సీక్వెల్‌పై అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాలో నటించిన రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుని బాలీవుడ్లో వరుస ఆఫర్లని దక్కించుకుంటోంది.
ప్రపంచ వ్యాప్తంగా మేనరిజమ్స్, సాంగ్స్, మేకోవర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన `పుష్ప` మూవీకి ప్రస్తుతం సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే మారేడుమిల్లిలో పూర్తయింది. తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న చిత్ర బృందం మరోసారి బన్నీకి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం మారేడుమిల్లి వెళ్లారని తెలిసింది. ఇందులోనూ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా రష్మిక మందన్న క్యారెక్ట్ గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. `పుష్ప 2`లో రష్మిక మందన్న క్యారెక్టర్ చనిపోతుందని, అందుకు సంబంధించిన స్టిల్ లీకైందని శనివారం ప్రచారం మొదలైంది. దీంతో రష్మికని చంపేస్తున్నారా? ఆ కారణంగానే `పుష్ప2` కోసం మరో హీరోయిన్ ని తీసుకున్నారా? అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని, మరాఠీ మూవీకి సంబంధించిన విజువల్స్‌ని నెట్టింట ప్రచారం చేస్తూ రష్మిక క్యారెక్టర్ని `పుష్ప 2`లో చంపేశారంటూ కావాలనే కొంత మంది ప్రచారం చేస్తున్నారని, దాన్ని నమ్మకండని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.