Ramarao On Duty:రవితేజ ఊర మాస్ డైలాగ్స్.. నెట్టింట లీక్
RamaRao On Duty powerful scene leaked: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు(జూలై 29)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్న ఈ సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ సీన్ లీక్ అవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లిప్పింగ్ ని బట్టి చూస్తే ఎడిటింగ్ రూమ్ నుంచే ఈ సీన్ లీకైనట్లు అర్థం అవుతుంది. అంత క్లారిటీగా ఉండడంతో మేకర్స్ కావాలనే ఈ సీన్ ను లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీన్ లో రవితేజ ఊర మాస్ డైలాగ్ అదిరిపోయింది.
‘మీరు ఎవరో ఏ పార్టీ వాళ్ళో నాకు అనవసరం.. అధికారంలో ఉన్నాం కదా అని.. గుంటలు తవ్వేస్తాం.. చెరువులు పూడ్చేస్తాం.. అడ్డంగా భూములు కొట్టేస్తాం అంటూ దౌర్జన్యం చేయాలని చూస్తే..’అంటూ రవితేజ రౌడీ గ్యాంగ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇందులో దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ లీకులపై మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి లీకులు ఎంకరేజ్ చేయొద్దని, సినిమాను థియేటర్ లోనే చూడాలని మేకర్స్ ప్రేక్షకులను కోరుతున్నారు.