సీనియర్ నటుడు శరత్ బాబు.. కొద్దిసేపటి క్రితమే మృతి చెందిన విషయం తెల్సిందే. గతః కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మరణించారు.
సీనియర్ నటుడు శరత్ బాబు.. కొద్దిసేపటి క్రితమే మృతి చెందిన విషయం తెల్సిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మరణించారు. ఈ విషయం తెలియడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక శరత్ బాబు సినిమా జీవితం అందరికి తెరిచిన పుస్తకమే. కానీ, ఆయన వ్యక్తిగత జీవితం లో ఎన్నో మలుపులు ఉన్నాయి.. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అందులో ఒకటి.. లేడీ కమెడియన్ రమాప్రభ ఆస్తిని శరత్ బాబు కాజేశాడని. ఇప్పటివరకు ఆ వార్తలో నిజం ఎంత అనే విషయం ఎవరికి తెలియదు. శరత్ బాబు కెరీర్ మొదట్లో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో రమాప్రభనే.. ఆయనకు సహాయం చేసింది. డైరెక్టర్లకు, నిర్మాతలకు పరిచయం చేసి అవకాశాలు వచ్చేలా చేసింది.
ఇక ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ తరువాత ఈ జంట ఆ రూమర్స్ ను నిజం చేస్తూ వివాహం చేసుకున్నారు. దాదాపు పదేళ్లు వీరు కలిసే ఉన్నారు. ఇక కొద్దికొద్దిగా వీరి సంసార జీవితంలో విబేధాలు రావడం మొదలయ్యాయి. ఇక చివరికి ఆ విబేధాల వలన విడాకుల వరకు వెళ్లారు. రమాప్రభ, శరత్ బాబు విడిపోయాకా.. వీరు ఒకరిపై ఒకరు చాలా ఆరోపణలు చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీల వలనే వీరు విడిపోయారని అప్పట్లో కథనాలు వచ్చాయి. రమాప్రభకు తాను కొన్నికోట్ల ఆస్తులు ఇచ్చానని శరత్ బాబు అనగా.. తన దగ్గర ఆస్తులన్నీ మోసం చేసి రాయించుకున్నాడని రమాప్రభ నిందించింది. అయితే ఇందులో ఎవరిది నిజం అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇప్పటికీ వీరి విడాకుల కథ గురించి నెట్టింట చాలా కథలు వినిపిస్తూనే ఉంటాయి.