Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ఇంట విషాదం
Ram Gopal Varma Uncle Producer Madhu Mantena Father Murali Raju Passed Away: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట విషాదం చోటుచేసుకుంది. వర్మ మేనమామ తండ్రి మురళీ రాజు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీరాజుకు ఇటీవల గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70. మురళీ రాజు.. ప్రముఖ నిర్మాత అయిన మధు వంతెన తండ్రి. మధు.. రామ్ గోపాల్ వర్మకు స్వయానా మేనమామ.
మధు వంతెన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గజిని, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, క్వీన్ వంటి సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మురళీరాజు మృతికి సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఆమిర్ ఖాన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మురళీరాజు పార్థివదేహానికి నివాళులు అర్పించి మధుని పరామర్శించారు. ఇక ఆర్జీవీ కుటుంబం కూడా నివాళులు అర్పించారు. అయితే చావులకు ఆర్జీవీ వెళ్ళడు కావున ఆయన ఎక్కడా కనిపించలేదు.