Ram Charan:టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్తగా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ (Konidela Productin Company) అనే నిర్మాణ సంస్థ ఉన్నా సొంతంగా కొత్త సంస్థని మొదలు పెట్టారు.
Ram Charan:టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్తగా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ (Konidela Productin Company)అనే నిర్మాణ సంస్థ ఉన్నా సొంతంగా కొత్త సంస్థని మొదలు పెట్టారు. యువీ క్రియేషన్స్‌లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న విక్రమ్ (విక్కీ)తో కలిసి చరణ్ తాజా సంస్థని స్టార్ట్ చేశారు. విక్కీ, రామ్ చరణ్ మంచి స్నేహితులు. కొంత కాలంగా నూతన నిర్మాణ సంస్థని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న వీరిద్దరు తాజాగా `వీ మెగా పిక్చర్స్` పేరుతో కొత్తగా ప్రొడక్షన్ హౌస్‌ని మొదలు పెట్టారు.
కొంత కాలంగా విక్కీ, రామ్ చరణ్ కలిసి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్‌లో కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థని 2017లో ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా మెగాస్టార్ నటించిన `ఖైదీ నంబర్ 150` వంటి భారీ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత 2019లో `సైరా నరసింహారెడ్డి` చిత్రాన్ని నిర్మించారు. ఇక 2022లో చిరుతో కలిసి చరణ్ నటించిన `ఆచార్య`, `గాడ్ ఫాదర్` చిత్రాలకు సహ భాగస్వామిగా వ్యవహరించింది.
కొంత కాలంగా నూతన టాలెంట్‌ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రామ్ చరణ్ కొత్త నిర్మాణ సంస్థని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. `వీ మెగా పిక్చర్స్` సంస్థపై నిర్మించనున్న చిత్రాల్లో నూతన నటీనటులతో పాటు కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఇదే బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయి సినిమాలని కూడా నిర్మించనున్నారట. ఆ కారణంగానే ఈ నూతన నిర్మాణ సంస్థని ప్రారంభించారు.
ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగా అభిమానులు చరణ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నెట్టింట ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జీ20 సదస్సులో ఇండియన్ సినిమా తరుపున పాల్గొన్న చరణ్ దీనిపై ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. తన ఆలోచనలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సినిమా ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.జిషన్రెడ్డికి, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.