Charan-Ntr: చరణ్- తారక్ సపరేట్.. కారణం ఇదే..?
Ram Charan And Tarak Are Promoted Separately: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చిలో రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఒక్క ఇండియాలోనే కాదు. ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆస్కార్ కు కూడా ఈ సినిమా నామినేట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడం, ఆస్కార్ అవార్డు వేడుకల కోసం చిత్ర బృందం అమెరికాకు వెళ్లడం కూడా జరిగిపోయాయి. ఇక గత కొన్నిరోజుల నుంచి ఇద్దరు హీరోలు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేస్తున్నారు. అయితే అంతకుముందు చరణ్- తారక్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. కానీ ఈసారి ఇద్దరు సపరేట్ సపరేట్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక తాజాగా అలా ఎందుకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అనేదానికి రీజన్ తెలిసిపోయింది. గతంలో వీరిద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ మధ్య విబేధాలు తలెత్తాయి. ఇద్దరూ కలిసి ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం వలన నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు వస్తున్నాయని రాజమౌళి దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో మరోసారి అలాంటి గొడవలు రాకుండా జక్కన్న ఇలాంటి ప్లాన్ వేశాడట. ఇంటర్వ్యూలలో ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నా పర్లేదు కానీ.. ఇద్దరు కలిసి మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చెప్పడంతో చరణ్ – తారక్ విడివిడిగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారట. అయితే ఇలా విడివిడిగా ఎవరికి వారు ఇంటర్వ్యూ లు ఇవ్వడం వలన వేర్వేరు అనే అభిప్రాయం వస్తుందనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆస్కార్ వేడుక అనంతరం ఈ ఇద్దరు ఎలా ఉండనున్నారో చూడాలి.