Rakul Preet Singh: జనాల దగ్గర డబ్బులు లేవు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్
Rakul Preet Singh Sensational Comments About Audience: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో కనిపించడంలేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకువెళ్తోంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోతోంది. ఈ మధ్య మరీ బక్కచిక్కి కనిపించిన రకుల్ ను తెలుగు ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఇక తాజాగా తన సినిమాలను అభిమానులు ఎందుకు చూడడం లేదన్న ప్రశ్న రకుల్ కు ఎదురయ్యింది. ఇక దానికి అమ్మడు కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. జనాలు తెలివిమీరిపోయారని, జనల దగ్గర డబ్బులు లేవని షాకింగ్ కామెంట్స్ చేసింది.
” నా పనిని బాక్సాఫీస్ నెంబర్లతో డిఫైన్ చేసి చెప్పలేను. ఇప్పుడు ప్రేక్షకులు తెలివిమీరిపోయారు. నెలకు ఒక్క సినిమానే వాళ్ళు చూడాలి. జనాల దగ్గర డబ్బులు లేవు.. అందుకే వారు నా సినిమాలు చూడడం లేదు. సినిమాలు ప్రతి వారం విడుదల అవుతూనే ఉంటాయి.. ఒక వారం అయితే రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. ఆడియన్స్ వచ్చి ప్రతి సినిమా చూడాలంటే ఎలా.. ముంబై లాంటి నగరాలలో ఒక సినిమా చూడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నా సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం కూడా ఒక కారణం” అని చెప్పుకొచ్చింది. ఆమె అన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు కానీ.. ఇలా నిర్మొహమాటంగా జనాల వద్ద డబ్బులు లేవు అని చెప్పడం కొంచెం షాకింగ్ గా ఉందని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు.