Rajinikanth: లైకాలో మరో సినిమా ఓకే చేసిన తలైవా
Rajinikanth’s Film ‘Thalaivar 170’ With TJ Gnanvel is Official: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులో కూడా అస్సలు తగ్గడం లేదు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా తలైవర్ 170 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈరోజు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఛైర్మన్ సుభాస్కరన్ పుట్టిన రోజును పురస్కరించుకొని రజినీతో మరో సినిమా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించనున్నారు. జై భీమ్ సినిమాతో ప్రపంచం మొత్తం తనవైపు తిరిగేలా చేసుకున్నాడు జ్ఞానవేల్. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై జై భీమ్ సినిమా ఎన్ని అవార్డులు, రివార్డులను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దర్శకుడు తో తలైవా సినిమా చేస్తున్నాడు అనేసరికి.. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఇకపోతే అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రజినీ.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లాల్ సలాం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తిచేసి తలైవా 170 ను పట్టాలెక్కించనున్నాడు రజినీ. ఇక ఈ ప్రాజెక్ట్ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఈ సినిమాలో ఎలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ను దర్శకుడు చూపిస్తాడో వేచి చూడాల్సిందే.