RajiniKanth:`శరత్ బాబు(Sarat Babu)తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. నటుడు కాకముందు నుంచే ఆయన నాకు తెలుసు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారన్నారు.
RajiniKanth:ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు (Sarat Babu) మృతి ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా ఏప్రిల్‌లో చేరిన శరత్ బాబు సోమవారం తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్స్ ఫెల్యూర్ కావడం, శరీరం విషతుల్యంగా మారడంతో ఆయన మృతిచెందినట్లుగా ఏఐజీ డాక్టర్లు దృవీకరించారు. హైదరాబాద్ నుంచి శరత్ బాబు భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించారు. ఆయననని కడసారి చూసేందుకు చెన్నైలోని ఆయన నివాసానికి సినీ తారలు తరలి వచ్చారు.
సుహాసిని, రాధిక, శరత్ కుమార్, రామ్ గోపాల్ వర్మ, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులు శరత్ బాబు పార్థీవ దేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. `శరత్ బాబుతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. నటుడు కాకముందు నుంచే ఆయన నాకు తెలుసు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారన్నారు.
శరత్ బాబు చాలా మంచివారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారు. ఆయన ముఖంలో నాకు కోపం కనిపించలేదు. అద్భుతమైన పాత్రల్లో నటించారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టం. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించేవారు. గతంలో ఓ సందర్భంలో నేను సిగరేట్ కాలుస్తుంటే…మానేయమంటూ నన్ను మందలించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా`అని రజనీ తెలిపారు.
ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రస్తుతం `జైలర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తుండగా `నరసింహా` తరువాత రమ్యకృష్ణ మరోసారి రజనీతో కలిసి నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 10న విడుదల కానుంది.