Rajinikanth To Cameo In Daughter Aishwarya's Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలతో బిజీగా ఉన్న రజినీ తాజాగా కూతురు కోసం నాలుగో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
Rajinikanth To Cameo In Daughter Aishwarya’s Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలతో బిజీగా ఉన్న రజినీ తాజాగా కూతురు కోసం నాలుగో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ సినిమా టైటిల్ తో సహా అధికారికంగా ప్రకటించారు.
ఐశ్వర్య దర్శకత్వంలో రజినీకాంత్ నటించబోయే ఈ చిత్రానికి ‘లాల్ సలామ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసారు. అయితే ఇందులో రజినీది ఫుల్ లెన్త్ రోల్ కాదు. స్పెషల్ అప్పీయరెన్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళిద్దరికీ సపోర్ట్ గా క్యామియో రోల్ లో తలైవర్ కనిపించనున్నారు. గెస్ట్ రోల్ అయినప్పటికీ అది కథలో చాలా కీలమైన పాత్ర అని సమాచారం. శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమయ్యింది. మరి కూతురు కోసం రజినీ నటిస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.