Raashi Khanna: మహేష్ పై కన్నేసిన ‘పక్కా కమర్షియల్’ బ్యూటీ
Rashi khanna Intresting Comments On Mahesh Babu: మ్యాచో హీరో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. జూలై 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న రాశీ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది.టాలీవుడ్ హీరోల్లో ఏ హీరోతో మీరు సినిమాను చేయాలని కోరుకుంటున్నారు అన్నట్లుగా ప్రశ్నించిన సమయంలో ఆమె తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.
నిజం చెప్పాలంటే టాలీవుడ్ లో ప్రతి హీరోయిన్ మహేష్ బాబు తో నటించాలని కోరుకుంటూనే ఉంటారు. ఇటీవల యంగ్ హీరోయిన్ శ్రీ లీల సైతం మహేష్ తో నటించడం తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. తాజాగా రాశి ఖన్నా ఆ జాబితాలో చేరింది. అయితే మహేష్ బాబుతో నటించే అవకాశం రావడం అంటే అది చాలా పెద్ద విషయం అన్నట్లుగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ ముద్దుగుమ్మల ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.