Pushpa 2: ఎట్టకేలకు పుష్ప 2 ను పట్టాలెక్కిస్తున్నారట ..?
Pushpa 2 Latest Update: అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేస్తోంది. పుష్ప 2 ను మేకర్స్ పట్టాలెక్కిస్తున్నారనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. గతేడాది పుష్పతో వచ్చి టాలీవుడ్ రేంజ్ ను రష్యా వరకు తీసుకెళ్లిన బన్నీ.. మరికొన్ని రోజుల్లో పుష్ప 2 ను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న పుష్ప ది రూల్ మూవీ సోమవారం నుండి హైదరాబాద్ లో జరుగనున్న ఫస్ట్ షెడ్యూల్ తో పట్టాలెక్కనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇందులో బన్నీతో పాటు రష్మిక కూడా పాల్గొననున్నదట.
ఇక ఈ మధ్యనే రష్యాలో రిలీజైన పుష్ప అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక సుకుమార్ ఈసారి గట్టిగా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. మరి మొదటి పార్ట్ తో ఇండియాను షేక్ చేసిన సుకుమార్ రెండో పార్ట్ తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.