Puri Jagannadh:వరుస ఫ్లాపుల తరువాత పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్`(ismart shankar)తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొతంం చేసుకున్నారు.
Puri Jagannadh:వరుస ఫ్లాపుల తరువాత పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్`(ismart shankar)తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. పక్కా తెలంగాణ స్లాంగ్‌లో సాగిన ఈ సినిమా
హీరోగా రామ్‌కు కూడా మంచి పేరుతో పాటు ఆయన కెరీర్లో తొలి మాసీవ్ బ్లాక్ బస్టర్‌ని అందించింది. 2019, జూలై 18న విడుదలైన ఈ సినిమా రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా రికార్డుని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తరువాత రామ్, దర్శకుడు పూరిల కెరీర్ మళ్లీ గాడి తప్పింది.
పూరి `లైగర్`తో భారీ డిజాస్టర్‌ని సొంతం చేసుకోగా హీరో రామ్ రెడ్, ది వారియర్ సినిమాలతో నిరుత్సాహ పరిచాడు. దీంతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కోసం దర్శకుడు పూరి, హీరో రామ్ చేతలు కలిపారు. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత వీరిద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ మూవీ `ఇస్మార్ట్ శంకర్`కు సీక్వెల్ ని ప్రకటించారు. `డబుల్ ఇస్మార్ట్` పేరుతో సీక్వెల్‌ని తెరపైకి తీసుకురాబోతున్నారు. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రకటించారు.
ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో `డబుల్ ఇస్మార్ట్`ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నాడు. `లైగర్`తో పూరి పాన్ ఇండియా కల కలగానే మిగిలిపోయింది. `లైగర్` భారీ డిజాస్టర్ కావడం, ఇప్పటికీ దాని నష్టాల నుంచి పూరి బయటికి రాకపోవడంతో `డబుల్ ఇస్మార్ట్` ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
చార్మితో కలిసి పూరి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. రామ్‌ను సరికొత్త మేకోవర్‌తో, తెలంగాణ యాసతో చూపించిన `ఇస్మార్ట్ శంకర్` ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి తిరుగులేని విజయాన్ని అందించింది. అదే మ్యాజిక్‌ని `డబుల్ ఇస్మార్ట్`తో రిపీట్ చేయాలన్నది పూరి ఆలోచన. అందుకు తగ్గట్టుగానే అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు.
2024, మార్చి 8న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన రోజే రిలీజ్ డేట్ ని చెప్పేయడంతో పూరి చాలా క్లారిటీతో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి పూరి తాను అనుకున్నట్టే `డబుల్ ఇస్మార్ట్`తో పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా?.. రామ్ తనదైన బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి ఇస్మార్ట్‌గా మ్యాజిక్ చేస్తాడా? అన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
The ENERGETIC combo of
Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh is back with ISMART BANG for #DoubleISMART🔥A high octane action entertainer in cinemas from MARCH 8th 2024💥
In Telugu, Hindi, Tamil, Malayalam, Kannada#HappyBirthdayRAPO@Charmmeofficial pic.twitter.com/zVq6AX6rH3
— Puri Connects (@PuriConnects) May 14, 2023