Unstoppable 2: పవన్ ఫ్యాన్స్ కు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య
PSPK x NBK First Glimpse Out: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఇప్పటివరకు బుల్లితెరపై.. ఎలాంటి టాక్ షోలకు అటెండ్ కానీ పవన్ మొదటిసారి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరైన విషేయమూ తెల్సిందే. షూటింగ్ ఎప్పుడో అయిపోయినా స్పెషల్ అకేషన్ రోజున ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయడం కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన పోస్టర్లు,వీడియోలు లీకై ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక తాజాగా మేకర్సే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా అభిమానులకు పవన్, బాలయ్య ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వేలమంది అభిమానుల కోలాహలం మధ్య పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ.. పవన్, బాలయ్య చేతులు కలపడం, బాలయ్య, పవన్ ను అనుసరించడం.. ఎప్పుడు లేనివిధంగా పవన్ ఆనందంగా నవ్వడం.. అన్ని ఫస్ట్ గ్లింప్స్ లో పొందుపరిచారు. ఇక చివర్లో బాలయ్య.. కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి అనడంతో పవన్ నవ్విన నవ్వుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.