రామ్ గోపాల్ వర్మకు ఇదే నా వార్నింగ్- నట్టికుమార్
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టికుమార్ గట్టి షాక్ ఇచ్చాడు. మరోసారి ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటూ స్టే తీసుకొచ్చాడు. దీంతో మళ్లీ వర్మ చిక్కుల్లో పడ్డాడు. ఇక ఈ కేసు విషయమై నట్టికుమార్ మాట్లాడుతూ.. “రామ్ గోపాల్ వర్మ ‘మా ఇష్టం’ రిలీజ్ పై కోర్టు మళ్లీ స్టే ఇచ్చింది. ఇద్దరు వాదనలు విన్న తర్వాతనే స్టే ఇస్తూ పది పేజీల ఆర్డర్ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్ లోనే కాకుండా ఎక్కడ టెలికాస్ట్ చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా జరుగుతుందని రామ్ గోపాల్ వర్మ కు తెలుసు.. డబ్బులు విషయంలో లీగల్ గానే వెళ్లాలనుకుంటున్నాము.
నేను ఎన్ని సినిమాలు చేసానో అందరికి తెలుసు.. కనీసం జీఎస్టీ కూడా వర్మ ఇవ్వలేదు, దానిపై కూడా కంప్లైంట్ ఇచ్చాము. గుర్తుపెట్టుకో వర్మ ఇదే నా వార్నింగ్.. మా డబ్బులు ఇస్తేనే మీ సినిమా లు రిలీజ్ అవుతాయి. ఇక తాజాగా అంబేద్కర్ యూనివర్సిటీ లో మీ ఇంటర్వ్యూ చూసి సభ్య సమాజంలో తలదించుకుంది” అని చెప్పుకొచ్చారు. మరి నట్టికుమార్ వ్యాఖ్యలపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.