Priyanka Chopra:బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ప్రియాంక చోప్రా ఆ తరువాత హాలీవుడ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే
Priyanka Chopra:బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ప్రియాంక చోప్రా ఆ తరువాత హాలీవుడ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ అమ్మడు తన సత్తా చాటుకుంటూ క్రేజీ స్టార్లతో కలిసి నటిస్తోంది. రీసెంట్గా `సీటాడెల్` సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రాపై నెటిజన్లు, ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న ప్రియాంక `ఆర్ఆర్ఆర్` సినిమాపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ట్రోలింగ్‌కు గురవుతోంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కలయికలో రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా హాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డుల్ని దక్కించుకుని వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ మూవీని ఇంత వరకు ప్రియాంక చోప్రా చూడలేదట. ఈ విషయాన్ని ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న ప్రియాంక చెప్పింది.
`నాకు ఇంత వరకు `ఆర్ఆర్ఆర్` చూసేందుకు సమయం దొరకలేదు. నేను సినిమాలు ఎక్కువగా చూడను. ఎప్పుడైనా సమయం ఉంటే టీవీల్లో వచ్చే కార్యక్రమాలు చూస్తుంటాను. కొన్ని షోలు మాత్రం క్రమం తప్పకుండా చూసేందుకు ప్రయత్నిస్తాను` అని తెలిపింది. ఇక ఇదే కార్యక్రమంలో `రామ్ చరణ్ ను `బ్రాడ్ పీట్ ఆఫ్ ఇండియా`గా పిలుస్తున్నారని, ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నిస్తే..`కచ్చితంగా అంగీకరిస్తాను. రామ్ చరణ్ ఉత్సాహంగా ఉంటారు. అంతే కాకుండా మంచి వ్యక్తి కూడా అని తెలిపింది.
అంతే కాకుండా రామ్ చరణ్, బ్రాడ్ పీట్లలో ఎవరు అందగాడు అని మీరు అడిగితే మాత్రం సమాధానం చెప్పలేను, ఎందుకంటే నేను బ్రాడ్ పీట్ సినిమాలు చూస్తూ పెరిగాను.. అతను నా క్రష్ అన్నారు. ఇక స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని ప్రియాంక తెలిపింది. అయితే ప్రియాంక చోప్రా ఇండియన్ అయి ఉండి ఇంత వరకు `ఆర్ఆర్ఆర్` చూడలేదని, ఆ సినిమా చూసేందుకు టైమ్ దొరకలేదని చెప్పడం నెటిజన్లతో పాటు ఆర్ఆర్ఆర్ అభిమానుల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది.
దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత వరకు మూడు గంటల సమయం దొరకలేదా` అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక `ఆర్ఆర్ఆర్` విషయంలో ట్రోల్ కు గురి కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఇది తమిళ సినిమా అని వెల్లడించి విమర్శలు ఎదుర్కొంది. ఇలా `ఆర్ఆర్ఆర్` విషయంలో రెండవ సారి కూడా నెటిజన్ లకు అడ్డంగా దొరికిపోవడంతో ప్రియాంకపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
Priyanka admits to not having seen RRR
by u/Big-Criticism-8926 in BollyBlindsNGossip