Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పూర్తి స్థాయి పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తే బాక్సాఫీస్ ఒక్కసారిగా షేక్ అయిపోవడం ఖాయం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దర్శకుడు ప్రశాంత్‌నీల్ `సలార్` మూవీతో ప్రభాస్‌లోని పూర్తి స్థాయి హీరోయిజాన్ని బయటికి తీస్తూ ప్రభాస్‌ని పవర్ ఫుల్ పాత్రలో స్క్రీన్‌పై ప్రజెంట్ చేస్తున్నారు.
Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పూర్తి స్థాయి పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తే బాక్సాఫీస్ ఒక్కసారిగా షేక్ అయిపోవడం ఖాయం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దర్శకుడు ప్రశాంత్‌నీల్ `సలార్` మూవీతో ప్రభాస్‌లోని పూర్తి స్థాయి హీరోయిజాన్ని బయటికి తీస్తూ ప్రభాస్‌ని పవర్ ఫుల్ పాత్రలో స్క్రీన్‌పై ప్రజెంట్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి కలయికలో రకానున్న `సలార్ పార్ట్ 1 సీజర్ ఫైర్`పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ విడుదలైన గంటల్లోనే రికార్డుస్థాయి వ్యూస్ నిరాబట్టడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
24 గంటల్లో సలార్టీర్ 83 మిలియన్లకు మించి వ్యూస్‌ని రాబట్టడంతో ఈ ఘనతనిఅతి తక్కువ టైమ్‌లో సాధించిన ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డు సాధించారు. టీజర్లో మోస్ట్ వయోలెంట్మ్యాన్ అంటూనే డైనోసార్‌తో ప్రభాస్‌ని నటుడు టీనూఆనంద్తో చెప్పించిన తీరు సినిమాపై అంచనాలని మరింత హైకి చేర్చింది. దీంతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టడం ఖాయం అనే సంకేతాలు మొదలయ్యాయి. ప్రభాస్ చేత ఒక్క డైలాగ్ కూడా చెప్పించకుండానే ప్రశాంత్ నీల్ చేసిన మ్యాజిక్ సంచలనంగా మారింది.
త్వరలోనే సలార్ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. సినిమా రిలీజ్‌కు సరిగ్గా నెలరోజులు మాత్రమే ఉండటంతో ట్రైలర్‌తో అసలు హంగామా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే `సలార్` టైలర్ని సెప్టెంబర్ 7నభారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. ఈ సందర్భంగా మేకర్స్ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు.అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి ట్రెండ్ అవుతోంది.ఇదిలా ఉంటే ఈ సినిమాప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఫస్ట్ పార్ట్‌ని సెప్టెంబర్ 28నభారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. టీజర్లో ట్రేడ్ వర్గాల్లో భారీ బజ్‌ని క్రియేట్ చేసిన `సలార్` తెలుగు రాష్ట్రాల హక్కులు మాత్రం షాక్ ఇస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయి ధర పలికాయని,రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.170కోట్లకు అమ్ముడు పోయాయని తెలిసింది.ఈ మధ్య కాలంలోనే కాకుండా తెలుగు సినీ చరిత్రలో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఇంత మొత్తానికి అమ్ముడు పోవడం ఇదే ప్రధమం కావడంతో `సలార్` సరికొత్త రికార్డుని సృష్టించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్లకు మించి టార్గెట్‌తో థియేటర్లలోకి రానుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.