Prabhas: ఆ వీడియో చూసి కంటతడి పెట్టిన ప్రభాస్..
Prabhas Emotional On Krishnamraju’ s Video: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో సందడి చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే బాహుబలి 1 ఎపిసోడ్ రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. ఇక నేడు బహువాలి 2 ఎపిసోడ్ ను మేకర్స్ స్ట్రీమ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ సందడి చేశాడు. బాలయ్యతో వేసే సరదా ప్రశ్నలతో అందరినీ నవ్వించాడు.
హీరోయిన్లతో గోల.. రాణి ఎవరు..? అంటూ ప్రభాస్ ను ఆడేసుకున్నాడు బాలయ్య. ఆ తరువాత ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి మాట్లాడాడు. పెదనాన్నను తలుచుకొని ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాషప్ వీడియోను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. పెదనాన్న గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. “ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయనే కారణం. ఆయనకు మనందరం రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాస్ నుంచి వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా చేసి సొంత బ్యానర్ ప్రారంభించి మహిళలతో చరిత్ర సృష్టించాడు. లేడీస్ ఓరియంటెడ్ కథలు తీశారు. ఈరోజు మా కుటుంబం ఆయన్ను చాలా మిస్సవుతున్నాం. ఐ లవ్ హిమ్” అని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ సైతం కృష్ణంరాజు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.