Prabhas: ఆకాష్ పూరి కి అండగా ప్రభాస్..
Prabhas Best Wishes To Akash Puri: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. ఇక ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి స్టార్లను చేసిన ఒక్క హీరో కూడా అతడి కొడుకును ప్రమోట్ చేయడానికి రారు.. సినిమావాళ్లు కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అయితే ఏ స్టార్ గురించి ఆంయినా మాటలాడు కానీ ప్రభాస్ గురించి మాత్రం మాట్లాడొద్దు అంటూ బండ్లన్న ఏకిపారేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆకాష్ ను హీరోగా నిలబెట్టడానికి ప్రభాస్ తన వంతు సాయం తాను చేస్తున్నాడు. గతంలో ఆకాష్ నటించిన రొమాంటిక్ మూవీ ప్రమోషన్స్ ప్రభాస్ పాల్గొన్న విషయం విదితమే.. ఇక తాజాగా నేడు సినిమా రిలీజ్ కావడంతో చిత్ర బృందానికి ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలిపాడు.
తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీ లో యూనిట్ కి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియచేయడంతో పాటు మూవీ ట్రైలర్ లింక్ ని షేర్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ప్రభాస్, పూరి డైరక్షన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి చిత్రాలలో నటించిన విషయం తెల్సిందే.