టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం పరాజయాల మధ్య కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ... ఇంకా వరుస అవకాశాలను అందుకుంటూ షాక్ ఇస్తుంది. ప్రస్తుతం పూజా..
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం పరాజయాల మధ్య కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ… ఇంకా వరుస అవకాశాలను అందుకుంటూ షాక్ ఇస్తుంది. ప్రస్తుతం పూజా.. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB28 లో నటిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మదర్స్ డే సందర్భంగా ఆదివారం పూజా హెగ్డే తన తల్లి లతతో కలిసి ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో లత తన కూతురు పూజకు ఎలాంటి అబ్బాయి భర్తగా కావాలో చెప్పుకొచ్చింది.
” పూజను అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి గురించి ఎదురు చూస్తోంది. పెళ్లి అనే బంధం కలకాలం నిలిచి ఉండాలంటే భార్యాభర్తలిద్దరి భాగస్వామ్యం ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండటం చాలా కష్టం. ఆ బంధం నిలవదు. పూజ చాలా సున్నిత మనస్కురాలు. తన ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి. అతడు స్ఫూర్తిగా నిలవాలి. కెరీర్ని ప్రోత్సహించాలి. అలాంటి అబ్బాయినే తను కావాలని కోరుకుంటుంది” అని చెప్పుకొచ్చింది. దీంతో పూజా ఈ ఏడాది లోనో.. వచ్చే ఏడాది లోనో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక పూజా కెరీర్ విషయానికి వచ్చేసరికి.. అమ్మడి ఆశలన్నీ SSMB28 మీదనే పెట్టుకుంది.ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా.. ఇప్పుడు ఐరెన్ లెగ్ అని అనిపించుకుంటుంది. మరి ఈ సినిమా మళ్ళీ పూజా కు పూర్వ వైభవం అందిస్తుందో లేదో చూడాలి.