Pooja Hegde: పెద్దమ్మ గుడిలో సందడి చేసిన బుట్టబొమ్మ
Pooja Hegde At Hyderabad Peddamma Temple: బుట్టబొమ్మ పూజా హెగ్డే హైదరాబాద్ పెద్దమ్మ గుడి లో సందడి చేసింది. నేడు ఆమె పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుంది. తన మొక్కులను చెల్లించుకున్న పూజా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించింది. అమ్మవారి ఆశీర్వాదాలు అందుకొని తీర్థ ప్రసాదాలను తీసుకుంది. ఇక పూజా హెగ్డే పెద్దమ్మ గుడికి వచ్చిందని తెలిసి స్థానికంగా పెద్ద ఎత్తున జనాలు అక్కడ పోగయ్యారు. ఆమెను చూడడానికి, ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటెత్తడంతో వెంటనే పూజా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఇక పూజా కెరీర్ ప్రస్తుతం నత్త నడకగా సాగతోంది. రాధేశ్యామ్ దగ్గరనుంచి ఇప్పటివరకు పూజకు ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో పూజా అమ్మవారిని దర్శించుకొని మంచి విజయాలను అందివ్వాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పూజా.. మహేష్ సరసన SSMB 28 లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన నటిస్తోంది. మరి ఈ ఏడాది అయినా పూజా హిట్ ను అందుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి.