పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం PKSDT.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం PKSDT. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం లో పవన్ దేవుడిగా కనిపిస్తుండగా.. తేజ్.. డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 28 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ‘బ్రో’ అనే టైటిల్ నే మేకర్స్ అధికారికం చేశారు. బ్రో టైటిల్ పాటు పవన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం అనే శ్లోకంతో మోషన్ పోస్టర్ మొదలయ్యింది. కాల రుద్రుడును ఒకపక్క, గడియారాలను ఇంకోపక్క బ్యాక్ గ్రౌండ్ లో చూపిస్తూ.. పవన్ ను లుక్ ను రివీల్ చేశారు. స్టైలిష్ దేవుడు స్వాగ్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కూల్ గా గ్లాసెస్ పెట్టుకొని పవన్.. పై నుంచి దిగివచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అభిమానులు చొక్కాలు చింపుకోవడం ఖాయమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చివర్లో బ్రో.. అనే సౌండ్ తో వచ్చే మ్యూజిక్ అయితే సినిమా వచ్చేవరకు దిమాక్ లో నుంచి పోదని చెప్పాలి. కాలరుద్రుడే స్టైలిష్ గా భూమిమీదకు వస్తే ఎలా ఉంటుందో ఈ మోషన్ పోస్టర్ లో చూపించేశారు. ఇక త్రివిక్రమ్ మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఒక్క టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.