OTT Flash Back: గత ఏడాది చివర్లో వచ్చిన ఫిజిక్స్ వాలా గురించి మీకు తెలుసా?
Physics Wala Web Series streaming free on amazon Mini TV
ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీక్షకులకు ఎంగేజింగ్ కంటెంట్ అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఒక పక్క హిట్ సినిమాలను ప్రసారం చేస్తునే మరోపక్క వెబ్ సిరీస్ లను అందిస్తున్నాయి. వెబ్ సిరీస్ ల విషయంలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛ లభించడంతో ఎంతో ఆసక్తికరంగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వీలునన్న ఎక్కువ ఎపిసోడ్ల ద్వారా తాము చెప్పదలచుకున్న విషయాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆదరణ పొందుతున్నారు.
వారం వారం కొత్త కొత్త కార్యక్రమాలను అందిస్తూ ఓటీటీ సంస్థలు ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలో గతంలో స్ట్రీమింగ్ అయిన కొన్ని అద్భుతమైన వెబ్ సిరీస్ ల గురించి తెలియని వారు చాలా మందే ఉన్నారు. కొత్తగా ఓటీటీలకు అలవాటు పడుతున్న వారికి గతంలో వచ్చే మంచి ప్రోగ్రామ్ ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.
హిందీలో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ ఉంది. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త వాటిని అందిస్తున్నాయి. గత ఏడాది చివరిలో కూడా అద్భుతమైన వెబ్సిరీస్ లు స్ట్రీమింగ్ అయ్యాయి. ప్రాంతీయ భాషల్లోని వీక్షకులను కూడా దృష్టి పెట్టుకుని మరీ వాటిని అందిస్తున్నారు. హిందీలో రూపొందిన కొన్ని వెబ్ సిరీస్ లు తెలుగు, తమిళ భాషలప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయా భాషల్లో డబ్బింగ్ చేయిస్తున్నారు. స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఫిజిక్స్ వాలా వెబ్ సిరీస్
అలఖ్ పాండే అనే ఫిజిక్స్ టీచర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఫిజిక్స్ వాలా. అమేజాన్ ప్రైమ్ సంస్థ ఈ వెబ్ సిరీస్ నిర్మించింది. అమేజాన్ మినీ టీవీలో ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించింది. మొత్తం 6 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తికరంగా ఉందని టాక్ వచ్చింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఇటువంటి సిరీస్ లను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు.
ఫిజిక్స్ వాలా వెబ్ సిరీస్ ను అభిషేక్ ధండారియా దర్శకత్వం వహించారు. ఆయనే ఈ సిరీస్ నిర్మాత కూడా. అబౌట్ ఫిల్మ్ అనే బ్యానర్ ద్వారా ఆయన సిరీస్ నిర్మాణం చేపట్టారు. సమీర్ మిశ్రా మాటలు అందించారు. శ్రీధర్ దుబే ఫిజిక్స్ వాలా క్యారెక్టర్ చేయడం ద్వారా ప్రేక్షకులను కట్టిపడేశారు.
ఫిజిక్స్ సబ్జెక్ట్ కఠినంగా భావించే విద్యార్ధులకు ఫిజిక్స్ వాలా ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయుక్తంగా మారింది. అలఖ్ పాండే ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఫిజిక్స్ పాఠాలు అందరికీ అర్ధమయ్యేలా సులభతరంగా బోధించడం ప్రారంభించారు. దీంతో ఫిజిక్స్ వాలా అనే యూ ట్యూబ్ ఛానెల్ కు పాపులారిటీ పెరిగింది. పాఠాలు చెప్పే మాస్టర్ అలఖ్ పాండేకు కూడా పాపులారిటీ విపరీతంగా పెరిగింది.
ఆన్ లైన్ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన పాండే జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మిస్తే అది తప్పకుండా హిట్ అవుతుందని భావించిన అమేజాన్ సంస్థ ఆ దిశగా అడుగులు వేసింది. వెబ్ సిరీస్ నిర్మాణం పూర్తి చేసి గత ఏడాది డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. అమేజాన్ మినీ టీవీలో ఈ సిరీస్ ను ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించింది.
ఓటీటీలు గతంలో అందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లను కూడా ప్రస్తుతం ఎటువంటి ప్రయాస లేకుండా చూసే అవకాశం ఉంది.మనకు కావలసిన సమయంలో, ఇష్టమైన ప్రదేశంలో కూర్చుని చూసే అవకాశం ఉంది. స్పూర్తివంతమైన ఫిజిక్స్ వాలా జర్నీని తెలుసుకోవాలని అనుకునే వారికి ఈ ఫిజిక్స్ వాలా వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది.