Pelli SandaD: పెళ్లి సందD ఓటిటీలోకి వచ్చేది ఎప్పుడంటే..?
Pelli SandaD OTT Alert: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా నటించిన చిత్రం పెళ్లి సందD. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహించింది. శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి చిత్రానికి లేటెస్ట్ వెర్షన్ గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని మంచి వసూళ్లనే రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో శ్రీలీల కు వరుస అవకాశాలు తలుపుతట్టాయి.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటీ లో రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ5 ఈ సినిమా హక్కులను భారీ ధర పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం జూన్ 24 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు అధికారికంగా తెలిపారు.
“పెళ్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..” అంటూ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. అద్భుతమైన పాటలు, ఇంకా అద్భుతమైన లొకేషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా జూన్ 24 నుంచి సందడి చేయనుంది. మరి థియేటర్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ వేదికపై ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.