BRO Movie:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి సారి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా `బ్రో`. విలక్షణ నటుడు సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళ హిట్ సినిమా `వినోదాయ సితం` ఆధారంగా దీన్ని రీమేక్ చేశారు.
BRO Movie:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి సారి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా `బ్రో`. విలక్షణ నటుడు సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళ హిట్ సినిమా `వినోదాయ సితం` ఆధారంగా దీన్ని రీమేక్ చేశారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌లుగా నటించారు. టీజర్, ట్రైలర్‌లతో అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ జూలై 28న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తొలి రోజు తొలి షో నుంచి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. ఏపీ నేత అంబటి రాంబాబు వివాదంతో వార్తల్లో నిలిచిన`బ్రో` వసూళ్ల పరంగా ఫరవాలేదు అనిపించింది. వివాదం స్థాయిలోనే వసూళ్లని రాబట్టిన ఈ సినిమా నెల తిరక్కుండానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ మొదలైంది. నెల రోజుల్లోనే ఓటీటీలోకి రావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు అదే సినిమా నెట్టింట ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది.
కేవలం భారత్ లోనే కాకుండా దాయాది దేశం పాకిస్థాన్, బాంగ్లాదేశ్‌లలోనూ `బ్రో` రికార్డులు సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన దగ్గరి నుంచి పవన్ బ్రో మూవీ టాప్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆగస్టు 21 నుంచి 27 వరకు నెట్ ఫ్లిక్స్ విడుదల సమాచారం ప్రకారం ఈ సినిమా ఇండియాలో నెం.1లో ఉండగా పాకిస్థాన్, బాంగ్లాదేశ్‌లలో టాప్ 8లో నిలిచి ట్రెండ్ అవుతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీంతో పవన్ అభిమానులు థియేటర్లో పోతే పోయింది కానీ నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్‌గా అదరగొడుతోందని సంబరాలు చేసుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన `బ్రో` కొత్త పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. `వినోదాయ సితం` ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, తమన్ సంగీతంతో అదరగొట్టిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ టైమ్ దేవుడిగా నటించిన ఈ సినిమాలో గజిబిజి లైఫ్ కారణంగా కుటుంబాన్ని పట్టించుకోని యువకుడిగా సాయిధరమ్ తేజ్‌నటించారు.